బాబోయ్ మెర్నిపాడు రోడ్డు…

Mar 10,2024 11:54 #Konaseema

 వాహనదారులకు తప్పని అవస్థలు
ప్రజాశక్తి-మండపేట : మండలంలోని పాలతోడు నుంచి వెలగతోడు మీదుగా మెర్నిపాడు వెళ్లే మెయిన్ రోడ్డు  ప్రమాదాలకు నిలయంగా మారింది. సుమారు ఐదు కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు గోతుల మయంగా మారి రాళ్లు పైకి లేచి పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామాలకు సమీపంలో ఫ్యాక్టరీలు, నర్సరీలు వుండడంతో జీవనోపాధి కోసం కార్మికులు ఉద్యోగులు రోజు ఈ రోడ్డును ఎక్కువగా వారి అవసరాలకోసం వినియోగిస్తుంటారు. రోడ్డంతా అద్వానంగా మారడంతో రాత్రి సమయాల్లో తరచూ ప్రమాదాలకు గురై ఆస్పత్రి ఫాలో అవుతున్నావని వాహనదాల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే కనీసం రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

➡️