శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

May 16,2024 21:24

కేంద్ర బలగాలతో కవాతు నిర్వహిస్తున్న ఎస్‌ఐ జానీ బాషా

ప్రజాశక్తి-రామచంద్రపురం

ఎన్నికలు పూర్తయిన తర్వాత గ్రామాల్లో కార్యకర్తలు, వాదోప వాదాలకు దిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగించ రాదని కె.గంగ వరం ఎస్‌ఐ జానీ బాషా తెలిపారు. ఆయన కె.గంగవరం మండలంలోని కె.గంగవరం, దంగేరు, శివల, ఎర్ర పోతవరం గ్రామాల్లో కేంద్ర బలగాలతో గురువారం కవాతు నిర్వహించారు. ఎన్నికల అనంతరం కేంద్ర బలగాలు ఎక్కడకీ వెళ్లలేదని, లెక్కింపు పూర్తి అయ్యేవరకు ఇక్కడే ఉంటారన్నారు. గ్రామాల్లో పందేలు కాస్తూ వాదోపవాదాలకు దిగి ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తే, శాంతిభద్ర తలకు వివాదం కలిగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. అటువంటి సంఘ టన జరిగితే ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు చేపడతామని ప్రజలంతా ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యేవరకు గ్రామాల్లో సంయమనం పాటిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని ఆయన సూచించారు.

కేంద్ర బలగాలతో కవాతు నిర్వహిస్తున్న ఎస్‌ఐ జానీ బాషా

➡️