వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉచిత బిఎండి పరీక్షలు

Apr 7,2024 23:05

ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు

ప్రజాశక్తి-మండపేట

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బురుగుంట చెరువు వైఎస్‌ఆర్‌ పార్కు ఆవరణలో క్లబ్‌ అధ్యక్షుడు కోన సత్యనారాయణ సారథ్యంలో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. టోరంట్‌ కంపెనీ వారిచే నిర్వహించిన ఉచిత బిఎండి మెడికల్‌ క్యాంపులో డాక్టర్‌ బిక్కిన తాతబ్బాయి (బిటి చౌదరి) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిఎండి పరీక్షలు ద్వారా కీళ్లనొప్పుల శాతాన్ని గుర్తించారు. ఎముకల సాంద్రతను పరీక్షించి కాల్షియం పెరగడానికి తగిన సూచనలు చేశారు. ఆహార నియమాలు, నడక వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే మంచిదని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులు ఆస్టియో పొరోసిస్‌, ఆర్ధరైటిస్‌, కీళ్లనొప్పులు వంటి సమస్యలు రావడం సహజమన్నారు. తగ్గడానికి తగిన ఆహారం పోషకాహారం తీసుకోవాలన్నారు. కాల్షియం పెరగడానికి వాడే మందులను వైద్యుల సలహా మేరకు వేసుకోవాలన్నారు. సుమారు 82 మందికి పరీక్షలు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రెడ్డి రవిరాజు, తాతపూడి సుధీర్‌, గంపల సత్యప్రసాద్‌, తిరుశూల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

 

➡️