పట్టణంలోని 5వ వార్డులో గడపగడపకు

Feb 5,2024 15:15 #Konaseema
gadapa gadapaku in ramachandra

ప్రజాశక్తి-రామచంద్రపురం : పట్టణంలోని ఐదవ వార్డులో సోమవారం ఉదయం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ పిల్లి సూర్యప్రకాష్ వార్డులోని ఇంటింటికి పర్యటించారు . ఆయన వైయస్సార్ నగర్ నాయకులు పెద్దలు ఘన స్వాగతం పలికారు. ప్రతి కుటుంబాన్ని పలకరించి వారి సమస్యలు తెలుసుకొని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పథకాలు గురించి ప్రజలకి వివరించారు. 2024లో మళ్లీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి గాదంశెట్టి శ్రీదేవి , పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్, వార్డు కౌన్సిలర్, ప్రజా ప్రతినిధులు , పట్టణ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్స్, అభిమానులు పాల్గొన్నారు.

➡️