అంగన్‌వాడీ కేంద్రాల్లో గ్రాడ్యుయేషన్‌ డే

Jun 18,2024 21:36

సింగరాయపాలెంలో సర్టిఫికెట్లు అందజేస్తున్న ఐసిడిఎస్‌ సూపర్‌ వైజర్‌ రమాదేవి

ప్రజాశక్తి-యంత్రాంగం

అంగన్‌వాడీకేంద్రాల్లో మంగళవారం గ్రాడ్యుయేషన్‌డేని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదు సంవత్సరాల చదువును పూర్తి చేసి ఒకటో తరగతికి అర్హత పొందిన పిల్లలకు ధ్రువపత్రాలను అందజేశారు. ఉప్పలగుప్తం: పిల్లలకు కావలసిన అన్ని సౌకర్యాలను అంగన్‌ వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం కల్పిస్తుందని పిల్లలను కేంద్రాలకు విధిగా పంపాలని సర్పంచ్‌ పెయ్యల రాజ్‌ కుమార్‌ సూచించారు. భీమనపల్లి పంచాయతీ సింగరాయపాలెం అంగన్‌ వాడీ కేంద్రంలో మంగళవారం పట్టపద్రుల దినోత్సవం జరుపుకున్నారు. అంగన్‌ వాడీ కేంద్రాలకు వెళ్లే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న ప్రోత్సహకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా అంగన్‌ వాడీ పిల్లలకు సర్కిల్‌ సర్టిఫికెట్‌ లు అందజేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్‌ సూపర్‌ వైజర్‌ కె.రమాదేవి నాయకులు గుత్తుల నాగేశ్వరరావు, కన్నీడి రమేష్‌, అంగన్‌ వాడీ టీచర్లు డి.సుశీల,డి. కుమారి,కె.విజయలక్ష్మి,ఎస్‌. మీరాబాయి,లక్ష్మీనరసమ్మ, బాలమ్మ, అరుణ,సత్యవతి తదితరులు పాల్గొన్నారు. కపిలేశ్వరపురం: అంగన్‌వాడీ కేంద్రాలు ద్వారా చిన్నారులకు చదువుతో పాటు, పౌష్టిక ఆహారం అందించి, ఆట పాటలు నేర్పిస్తున్నారని ఐసిడిఎస్‌ సిడిపిఒ ఎ.గజలక్ష్మి అన్నారు. ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ మండపేట పరిధిలోని కపిలేశ్వరపురం మండలం టేకి సెక్టార్‌ వడ్లమూరు గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం గ్రాడ్యుయేషన్‌ డే ,మన అంగన్‌వాడీ పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల కార్యక్రమంలో సిడిపిఒ గజలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారుల తల్లులతో మాట్లాడారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు తప్పకుండా పంపించాలని తల్లిదండ్రులను కోరారు. చిన్నారులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అంగన్‌వాడీ టీచర్లను ఆదేశించారు.అలాగే గత సంవత్సరంలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన పిల్లలు ఏమి నేర్చుకున్నారు, వారు అందించే పౌష్టికాహారం పిల్లల ఎదుగుదలకు ఎలా సహాయపడింది తదితర అంశాలను సూపర్వైజర్‌ ఐ మాణిక్యం తల్లులకువివరించారు. గ్రాడ్యుయేషన్‌ డే సందర్భంగా చిన్నారులు ప్రత్యేక దుస్తులు ధరించారు. అంగన్వాడి కేంద్రాల్లో ఐదు సంవత్సరాలు చదువును పూర్తి చేసి ఒకటో తరగతికి అర్హత పొందిన పిల్లలకు ధ్రువపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సెక్టార్‌ సూపర్‌వైజర్‌ ఐ.మాణిక్యం, అంగన్‌వాడీ కార్యకర్తలు పి.పద్మావతి, జి.విజయ రత్నం, ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లులు, కిషోర్‌ బాలికలు, తదితరులు, పాల్గొన్నారు. మామిడికుదురు : అంగన్‌వాడీ కేంద్రాలు ద్వారా చిన్నారులకు చదువుతో పాటు, పౌష్టిక ఆహారం అందించి, ఆట పాటలు నేర్పడం జరుగుతోందని ఐసిడిఎస్‌ సిడిపిఒ విజయ శ్రీ అన్నారు. పి.గన్నవరం ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని పాశర్లపూడి బాడవ అంగన్‌వాడీ కేంద్రంలో ఐసిడి ఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం గ్రాడ్యుయేషన్‌డే, మన అంగన్‌వాడీ పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల కార్యక్రమంలో సిడిపిఓ విజయ శ్రీ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారుల తల్లులతో మాట్లాడారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు తప్పకుండా పంపించాలని తల్లిదండ్రులను కోరారు. చిన్నారులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని అంగన్వాడి టీచర్లను ఆదేశించారు. గ్రాడ్యుయేషన్‌ డే సందర్భంగా చిన్నారులు ప్రత్యేక దుస్తులు ధరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదు సంవత్సరాలు చదువును పూర్తి చేసి ఒకటో తరగతికి అర్హత పొందిన పిల్లలకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సెక్టార్‌ సూపర్‌వైజర్‌, అంగన్‌వాడీ కార్యకర్తలు , ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లులు, కిషోర్‌ బాలికలు, తదితరులు, పాల్గొన్నారు. ఆలమూరు : ప్రతి చిన్నారికి బాల్యం నుంచే విద్యపై మక్కువ పెంచుకునేలా అంగన్‌వాడీల ప్రణాళికలు ఉండాలని కొత్తపేట సిడిపిఒ బి.శారద అన్నారు. మండలంలోని మడికి అంగన్‌వాడీ సెంటర్‌ వద్ద బాలలతో మంగళవారం జరుగుతున్న గ్రాడ్యుయేషన్‌ డే కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సిడిపిఒ మాట్లాడుతూ 3 నుండి 5 ఏళ్ల వయసు వచ్చేవరకు ప్రతి చిన్నారికి ఆయా అంగన్‌వాడీ కేంద్రాల్లో క్రమశిక్షణ, సాటివారిపట్ల ప్రేమ అనురాగాలు, వారి ఆరోగ్యాలను ఎలా కాపాడుకోవాలో వంటి వాటిపై శిక్షణ ఇస్తారన్నారు. ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ధ్రువ పత్రాలు ఇచ్చి పై తరగతికి సిఫార్సు చేసి గ్రాడ్యుయేషన్‌ డే ను నిర్వహిస్తారని సిడిపిఒ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్‌ సెక్టార్‌ సూపర్‌వైజర్‌ బి.వరలక్ష్మి, కె.మెర్సి ఫ్లోరిన్సీ, పి.సత్యవతి, సిహెచ్‌.మంగతాయారు, సిహెచ్‌.భాను కుమారి, పి.రమణ, డి.శ్రీలక్ష్మి, ఎం.బేబీ శ్రీదేవి, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️