‘శ్రీ చైతన్య’లో గ్రాడ్యుయేషన్‌ డే

Apr 6,2024 21:41

విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన అతిథులు

ప్రజాశకి-మండపేట

మండలం లోని తాపేశ్వరం శ్రీ చైతన్య లో స్కూల్‌ ప్రిన్సిపల్‌ లక్ష్మి నారాయణ అధ్వర్యంలో శనివారం గ్రాడ్యుయేషన్‌ డే ఘనంగా నిర్వహిం చారు. ప్రాథమిక విద్యలో అడుగుపెడుతున్న యుకెజి విద్యార్థులకు, ప్రయిమరీ విద్య పూర్తి చేసుకుని హైస్కూల్లో అడుగుపెడుతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్‌ డే వేడుకలు నిర్వహి ంచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిజియోథెరపీ వైద్య నిపుణులు డాక్టర్‌ ఇమిడిశెట్టి విశ్వనాథ్‌ , వైద్యురాలు డాక్టర్‌ ఇమిడి శెట్టి జ్యోతిర్మయి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్‌ డే సర్టిఫికెట్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్‌ లో ఇటువంటి కార్యక్రమాలు చేయడం విద్యార్థులకు ఎంతో ఉత్సాహాన్ని విశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. విశ్వాసం పట్టుదల విజయానికి మెట్లుగా మారతాయన్నారు. ఈ సందర్బంగా ఐన్‌టిస్‌ఒలో ఒలింపియాడ్‌ పోటీ పరీక్షలలో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు, విద్యార్థుల, విద్యార్థులు తల్లి దండ్రులు తదితరులు పాల్గొన్నారు.

 

➡️