ఆదమరిస్తే… అంతే..

Mar 9,2024 11:04 #Konaseema

ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలి
ప్రజాశక్తి-మండపేట : మండలంలోని ఏడిద సీతానగరం నుండి వెలగతోడు, పాలతోడు వెళ్లే రోడ్డులో రహదారిని అనుకొని ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ 11 కివి వైర్లు చేతికి అంది అంత ఎత్తులోనే ఉండడంతో రైతులు, వ్యవసాయ కూలీలు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పొరపాటున విద్యుత్ వైర్లు వైర్ తగిలితే ప్రమాదం సంభవిస్తుందని ట్రాన్స్ఫార్మర్ను ఎత్తులో పెట్టడమే కాకుండా ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు ప్రమాదాలు సంభవించక ముందే తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

➡️