సచివాలయ భవనం ప్రారంభించిన ఎంపీ బోస్

Mar 11,2024 15:49 #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం : మండలంలోని వెంకటాయపాలెం గ్రామంలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయ భవనాన్ని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యల్లమెల్లి సతీష్ కుమారి, రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, కే గంగవరం ఎంపీపీ పంపన నాగమణి, డీసీఎంఎస్ డైరెక్టర్ పెట్టా శ్రీనివాసరావు, ఏపీ ఐ డి సి డైరెక్టర్ వాసంశెట్టి శ్యామ్, ఎంపీటీసీ కణితి ఈశ్వరి, శెట్టిబలిజ సంఘం గౌరవ అధ్యక్షులు రాయుడు చందర్రావు, హసంబాద సర్పంచ్ నాగిరెడ్డి సతీష్, ఎంపీడీవో రామచంద్రమూర్తి, ఈవోపీఆర్ది సెలెట్ రాజు, వైసిపి నాయకులు ఎల్లమెల్లి రవికుమార్, అంబటి నెహ్రూ, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు వైసీపీ అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

➡️