సమస్యను పట్టించుకోవడం లేదు

Feb 7,2024 10:59 #Konaseema
rdws officers neglect problems

ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై గ్రామ సర్పంచ్ తోకల మంగాదేవి.

ప్రజాశక్తి-రామచంద్రపురం : తామరపల్లి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేదని గ్రామ సర్పంచ్ తోకల మంగాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు ఉదయం కేవలం అరగంట మాత్రమే మంచినీరు సరఫరా అవుతుంది అని దీంతో గ్రామస్తులంతా త్రాగునీటి కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. గతంలో చాలా వీధులకు మంచినీటి కుళాయిలు కూడా నిర్మించలేదని ప్రస్తుతం ఉన్న వాటర్ ట్యాంక్ కెపాసిటీ సరిపోవటం లేదని వేరే వాటర్ ట్యాంక్ నిర్మించాలని ఉదయం సాయంత్రం మంచినీరు సరఫరా అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

➡️