అల్పపీడన ప్రభావంతో తగ్గిన ఉష్ణోగ్రతలు

May 25,2024 15:27 #Konaseema

45 డిగ్రీల నుండి 30 కి చేరుకున్న వైనo
పలుచోట్ల తడిసిన ధాన్యం
ఊపoదుకున్న ఎగుమతులు

ప్రజాశక్తి-రామచంద్రపురం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం నుండి కురుస్తున్న వర్షాలకు ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోయాయి. మొన్నటి వరకు 40 డిగ్రీలు పైగా నమోదైన ఉష్ణోగ్రతలు శనివారం నాటికి 30 డిగ్రీలకు చేరుకున్నాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో పట్టణ, పల్లె వాసులు వేడి ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం పొందారు. మరోవైపు వర్షాలకు రైతులు దాచుకున్న ధాన్యం తడిసిపోయింది. వర్షాలు మరింతగా కురుస్తాయి అన్న సమాచారంతో రైతుల అప్రమత్తమయ్యారు ధాన్యం రాశులపై పలు రైతులు బరకాలు కప్పుకోగా, ఎగుమతులు వేగం పెంచారు. దీంతో ట్రాక్టర్ల పై తర్పాలిన్ కవర్లు కప్పి ధాన్యం మిల్లులకు ఎగుమతులు వేగంగా జరుగుతున్నాయి. ఇక మొదట్లో 75 కేజీల బొండల ధాన్యానికి రూ 1400 చెల్లించగా ప్రస్తుతం రూ 1600 చేరుకుంది. వాతావరణ మార్పులతో పాటు రైతులకు ధాన్యం ధర పెరగడంతో ఇదే విధంగా పెద్ద ఎత్తున రైతులు దాల్వా ధాన్యాన్ని ఎగుమతులు చేస్తున్నారు. మరోవైపు రోడ్ల వెంబడి పోగు చేసుకున్న ధాన్యాన్ని రైతులు బరకాలు, తార్పాలైన్ కవర్లు కప్పి జాగ్రత్త చేసుకుంటున్నారు. మరో మూడు రోజులపాటు అల్పపీడనం కొనసాగుతుందన్న సమాచారంతో రైతన్నలు ఇప్పటికీ అప్రమత్తమయ్యారు.

➡️