శివల గ్రామంలో సూర్య ప్రకాష్ పర్యటన

Apr 12,2024 12:14 #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం : కే గంగవరం మండలం శివల గ్రామం లో శుక్రవారం వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు ఎస్సీ నాయకులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి సూర్య ప్రకాష్ పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో జగనన్న పాలన కోసం మరొకసారి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు మళ్ళీ అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అడవి కుమార్, శివల గ్రామ పెద్దలు, మోర్తా శ్రీనివాస్ , కొమనపల్లి శ్రీనివాస్ , మోర్తా ప్రకాష్ , ఉలపల్లి సురేంద్ర, తదితరుల పాల్గొన్నారు.

➡️