ఉన్నత విద్యాసంస్థలో ప్రవేశం కల్పించడమే లక్ష్యం

Apr 11,2024 22:47

సమావేశంలో మాట్లాడుతున్న మధుసూదన్‌ రావు

ప్రజాశక్తి-అమలాపురం

టెన్త్‌ పాసైన విద్యా ర్థుల్లో ప్రతిభా వంతులను గుర్తించి, వారికి తర్ఫీదునిచ్చి ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశం కల్పించడమే లక్ష్యమని కెజిబివి సెక్రటరీ డి. మధుసూదన్‌ రావు అన్నారు. ఎపి షెడ్యూల్‌ కులాల సంక్షేమ సంఘం ఎస్‌/16 జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుద్ధ విహార్‌ నందు గురువారం అంబేడ్కర్‌ ఆశయ సాధన పే బ్యాక్‌ టు ద సొసైటీలో భాగంగా జరిగిన సెమినార్‌ నిర్వహించారు. కార్యక్రమంలో మధుసూదన్‌ రావు పాల్గొని ప్రసంగించారు. ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులను పదో తరగతి పాసైన అనంతరమే మంచి తర్ఫీదు ఇచ్చి ఉన్నత స్థాయి విద్యాసంస్థలలో సీట్లు పొందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న అనేక సమస్యలను వివరించారు. ఎపి ఎస్‌సి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ అధ్యక్షులు బత్తుల నకుల రాజు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమ ంలో అల్లవరం ఎంఇఒ కె.కిరణ్‌ బాబు, ఎస్‌ఎస్‌ఎ ఎపిఎం ఎంఎకె.భీమారావు, ఎపి ఎస్‌సి వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గోసంగి బంగార్రాజు, ఆర్థిక కార్యదర్శి సాధనాల సత్యనారాయణ, గెజిటెడ్‌ ప్రధానో పాధ్యాయులు గుంట్రు వెంకటేశ్వరరావు, కె.ఘన సత్యనారాయణ, ఎంఈఓ వెంకట రమణ, నక్కా డేవిడ్రాజు, రూపస్‌ రావు, గెడ్డం ప్రదీప్‌, తదితరులు పాల్గొన్నారు.

 

➡️