ముమ్మరంగా వాహనాల తనిఖీ

Apr 11,2024 22:58

వేగాయమ్మ పేట వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారులు

ప్రజాశకి-రామచంద్రపురం

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీని అధికారులు ముమ్మరం చేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం బైపాస్‌ రోడ్‌ లోనూ, ద్రాక్షారామ యానాం రోడ్డులోని వేగాయమ్మ పేట వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ఉదయం నుండి రాత్రి వరకు కొనసాగిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో వాహనాల్లో నగదు, మద్యం వంటివి తరలిస్తారని ముందు జాగ్రత్తగా తనిఖీలను ముమ్మరం చేశారు. వేగాయన్నపేట తనిఖీ కేంద్రం వద్ద డివిజనల్‌ ఇంజినీర్‌ సూర్యనారాయణ, పోలీసులు, కెమెరామెన్‌ సహకారంతో వాహనాల తనిఖీని చేపట్టారు. మే 13 ఎన్నికలు పూర్తయ్యే వరకు తనిఖీలు కొనసాగు తాయని ఈ సందర్భంగా డిఇ సూర్యనారాయణ వివరిం చారు. యానాం నుంచి ద్రాక్షారామ వరకు గల పరిసర ప్రాంతాల వాహనాలన్నీ ఈ మార్గం గుండానే వస్తాయని దీనితో ముందస్తు జాగ్రత్తగా ఎన్నికల అధికారులు ఇక్కడ తనిఖీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.

 

➡️