ఓటురు అవగాహనా కార్యక్రమాలు : కల్టెకర్‌

Apr 3,2024 18:16

కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

ప్రజాశక్తి-అమలాపురం

క్రమబద్ధమైన ఓటరు, విద్య ఎన్నికలలో భాగస్వా మ్యం పేరున ఓటర్లలో చైతన్యాన్ని తీసుకుని వచ్చేందుకు ఓటరు అవ గాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో ఎటు వంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియో గం చేసుకోవాలని ఆయన పిలుపు నిచ్చా రు. ఓటు హక్కును వినియోగిం చుకునే వారు కుల, మత, రాజకీయ ప్రలోభాలకులోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 85 సంవత్సరాల వయసు పైబడిన వారు, వికలాంగులకు కల్పించిన హోం ఓటింగ్‌ విధానంపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఓటు వేయడానికి వచ్చిన వారికి పోలింగ్‌ కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించామని, 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా తమ ఓటు నమోదు కానట్లయితే ఫాం-6ను ఆన్లైన్‌ లేదా బూత్‌ లెవల్‌ అధికారిని కలిసి నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ఎన్నికల్లో నిర్భ యంగా ఓటు హక్కును వినియోగిం చుకోవాలన్నారు. ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు సదుపా యాల కల్పనకు సాక్ష్యం యాప్‌ ద్వారా ఎన్నికల్లో పాల్గొనే విభిన్న ప్రతిభా వంతులకు ఎన్నికల కమిషన్‌ పలు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోందని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని జిల్లా లోని వికలాంగులంతా శతశాతం వారి ఓటు హక్కును వినియోగించు కోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం జరుగుతోందన్నారు. ఎన్నికల కమిషన్‌ వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలను కల్పించామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాలను గ్రౌండ్‌ ఫ్లోర్లోనే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విభిన్న ప్రతి భావంతుల కోసం ఎన్నికల కమిషన్‌ ప్రత్యేకంగా రూపొందించిన సాక్ష్యం యాప్‌, ఎంతో సహాయకారిగా ఉంటుందని, దీనిని దివ్యాంగులు ప్రతి ఒక్కరూ డౌన్లోడ్‌ చేసుకోవాలని కోరారు.. 85 సంవత్సరాలు వయ సు పైబడిన మంచాలకే పరిమితమై నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులు హోమ్‌ ఓటింగ్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటరు జాబితా లో వికలాంగులుగా నమోదై ఉండి. సదరం ధ్రువీ కరణ పత్రం ప్రకారం తమకు 40 శాతం పైబడి వికలాం గత్వం ఉంటే వారు ఇంటివద్దనుంచే ఓటు వేసే అవకాశం ఉందన్నారు. సాక్ష్యం యాప్‌ ద్వారా హోమ్‌ ఓటింగ్‌ కోసం ముందస్తుగా దర ఖాస్తు చేసుకోవా ల్సి ఉంటుం దన్నారు. అలాగే పోలింగ్‌ కేంద్రానికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం కావా లన్నా, ఓటరు జాబితాలో పేరు తెలుసు కోవాలన్న తమ పోలింగ్‌ కేంద్రం వివరాలను తెలుసు కోవా లన్నా వీల్‌ చైర్‌, వలంటీర్‌ సౌకర్యం కావాల్సివచ్చినా ఈ యాప్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వాయిస్‌ అసిస్టెంట్‌, తదితర సదు పాయాలు కూడా ఈ యాప్లో ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా వీల్‌ చైర్లను ఎన్నికల రోజు అందుబాటు లో ఉంచుతామని చెప్పారు. అంధు లకు బ్రెయిలీ లిపిలో ఓటరు స్లిప్పులను పం పిణీ చేసేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద బ్రెయిలీ లిపిలో నమూనా బ్యాలెట్‌ పేపరు ఏర్పా టు చేస్తామని, దాని ద్వారా తమకు నచ్చిన అభ్యర్థి కి ఓటు వేయవ చ్చునన్నారు. విభిన్న ప్రతిభా వంతుల కు అనుకూల ంగానే ఓటింగ్‌ ప్రక్రియ ను రూపొందించినట్లు వివరించారు.

 

➡️