ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం

Jan 25,2024 11:55 #Konaseema
voters day in mandapeta

ప్రజాశక్తి-మండపేట : ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం అని 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు పొంది తప్పనిసరిగా  వినియోగించుకోవాలని తాసిల్దార్ టి ఆర్ రాజేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ టి.రామకుమార్ అన్నారు. గురువారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కలువ పువ్వు సెంటర్లో మనోహరం చేపట్టి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ, రాష్ట్ర, గ్రామాల అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటును ఆయుధంగా వాడుకోవాలన్నారు. ఓటుహక్కుపై అవగాహన కల్పించేందుకు ఏటా జనవరి 25న ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై కోన అప్పారావు, మున్సిపల్ మేనేజర్ తాతపూడి కనకరాజు, ఎలక్షన్ డి.టి మెహర్ బాబా, ఎఫ్ డి ఓ రమణ రావు, బిజెపి నాయకులు కోన సత్యనారాయణ, ఉధ్యాయాలు, సచివాలయ, రెవిన్యూ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

➡️