కోస్తా మురళీకృష్ణకు జాతీయ అవార్డు

Nov 29,2023 22:40

ప్రజాశక్తి-కలెక్టరేట్‌
ఇనిస్టూట్‌ ఆఫ్‌ వ్యాల్యూయర్స్‌ ఉత్తమ చైర్మన్‌గా మచిలీపట్నం ఇంజనీర్‌ కోస్తా మురుళి కృష్ణ జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. ఇంజనీరింగ్‌, వ్యాల్యూషన్‌లో విశేష ప్రతిభ కనబరిచినందుకు మురళీకృష్ణకు ఇండియన్‌ వాల్యూస్‌ గ్లోబల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన గ్లోబల్‌ వ్యాల్యూషన్‌ సమ్మిట్‌లో ఈ అవార్డు అందించారు. మురళీకృష్ణ చైర్మన్‌గా ఉన్న ఎపి ఇనిస్టూట్‌ ఆఫ్‌ వాల్యూషన్‌ విజయవాడ బ్రాంచికి జాతీయ స్థాయిలో మోస్టు ఎమర్జింగ్‌ అవార్డు లభించింది. బ్యాంకు లోన్స్‌కి అంచనాలు వేయడం, విలువలు కట్టడానికి స్థాపించబడిన ఈ సంస్ధకు జాతీయ స్థాయిలో 80 బ్రాంచిలు కలిగి ఉంది. 81 వేల మంది ఇంజనీర్లు సభ్యులున్నారు.

➡️