త్యాగనిరతికి ప్రతీక బక్రీద్ పండుగ

Jun 17,2024 10:22 #Krishna district

ప్రజాశక్తి-చల్లపల్లి : ఇస్లాం ప్రవక్తల త్యాగనిరతికి ప్రతీక బక్రీద్ పండుగ అని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. సోమవారం చల్లపల్లి మహమ్మదీయ మస్జీదులో ఈదుల్ అదా (బక్రీద్) పర్వదిన వేడుకల సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వెంకట్రామ్ విచ్చేసి ముస్లింలకు మిఠాయిలు పంచిపెట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు ఖుర్బాని దానం చేయటం ద్వారా నిరుపేద ముస్లింలు కూడా పండుగ సంతోషంగా జరుపుకోవాలనే ఆకాంక్ష స్ఫూర్తిదాయకం అన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర టీఎన్.టీ.యూ.సీ కార్యనిర్వాహక కార్యదర్శి రావి చంద్రశేఖర్ (చిట్టి), తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివ, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఉస్మాన్ షరీఫ్, పార్టీ నాయకులు పసుపులేటి రవికుమార్, సోమిశెట్టి రాఘవ, ఉరిమి మణికంఠ, కాజ చేతన్, సాధనాల సతీష్, గంగిశెట్టి రాజేంద్ర పాల్గొన్నారు.

➡️