వేదవ్యాస్‌ను కలిసిన బాలశౌరి

Apr 11,2024 22:43

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా)

పెడన అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ సీటు ఆశించి నిరాశతో ఉన్న మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూడగడ్డ వేదవ్యాస్‌ నివాసానికి బందరు పార్లమెంట్‌ సభ్యులు వల్లభనేని బాలశౌరి, జనసేన నియోజక వర్గ ఇంఛార్జి బండి రామకష్ణ,లు గురువారం పార్టీ నాయకులతో వెళ్లి వేదవ్యాస్‌ కలిశారు. ఇద్దరి మధ్య కొద్ది సేపు జరిగిన చర్చలు అనంతరం బాలశౌరి విలేఖర్లతో మాట్లాడుతూ కొన్ని కారణాల వలన ఆశించిన సీటు వ్యాస్‌ కి రాలేదన్నారు.ఇక్కడ పరిస్థితులు ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ తో చర్చించి వేద వ్యాస కు రాజకీయంగా న్యాయం జరిగేటట్టు చూస్తాం హామీ ఇచ్చారు.వేదవ్యాస్‌ కి వేరే ఆలోచన లేదని మాతోని కలసి పనిచేస్తారు మా విజయంలో ఆయన కూడా భాగస్వామి అవుతాడని స్పష్టం చేశారు.బూరగడ్డ వేదవ్యాస్‌ మాట్లాడుతూ బాల శౌరి తో గత 20 సవంత్సరాల నుండి పరిచయం ఉందని అంతే కాకుండా వారితో బంధుత్వం కూడా ఉందని అయితే కొన్ని సమస్యలు ఉన్నాయని అవన్నీ వారితో చర్చించడం జరిగిందన్నారు. అలాగే వారి విజయానికి తన శాయశక్తులా కషి చేస్తానని ప్రకటించారు.

➡️