ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు : కలెక్టర్‌

Apr 11,2024 22:40

ప్రజాశక్తి-గన్నవరం

గన్నవరం నియోజకవర్గ కేంద్రమైన గన్నవరంలో జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌ రూములను గురువారం కలెక్టర్‌ పరిశీలించారు. గన్నవరం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాట్లు కలెక్టర్‌కు వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాట్లు చేశారా లేదా పరిశీలించినట్లు తెలిపారు. ఏవైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసి ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల అధికారులు కలెక్టర్‌ వెంట ఉన్నారు.

➡️