కాంగ్రెస్‌ అభ్యర్థి వడ్డాది ప్రచారం

Apr 24,2024 23:31

ప్రజాశక్తి-గుడివాడ

ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గుడివాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వడ్డాది గోవిందరావు(రాజేష్‌) పార్టీ ఇన్‌చార్జి శిష్ట్లా దత్తాత్రేయులతో కలిసి స్థానిక ముబారక్‌ సెంటర్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు దగాని నిశ్చల, మధుకృష్ణ, వడ్దాది శివకృష్ణ, కసిరెడ్డి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

➡️