సీతారామయ్య మరణం పట్ల సిపిఎం సంతాపం

May 27,2024 13:24 #Krishna district

ప్రజాశక్తి-కృష్ణా జిల్లా : మల్లంపాటి  సీతారామయ్య మరణం పట్ల సిపిఎం కృష్ణా జిల్లా కమిటీ  సంతాపాన్ని తెలిపింది. సీతారామయ్య గన్నవరం మండలం సూరంపల్లి గ్రామ శాఖా కార్యదర్శిగా దీర్ఘ కాలం పని చేశారు. ప్రస్తుతం సీనియర్ పార్టీ సభ్యులుగా ఉన్నారు. రైతు కుటుంబంలో జన్మించిన సీతారామయ్య చిన్న వ్యాపారం చేసుకుంటూ ఆ ప్రాంతంలో పార్టీ నాయకునిగా నిబద్ధతతో పనిచేశారు. పార్టీ కార్యక్రమాలన్నింటిలోనూ ముందుండి నడిపేవారు. నీతి, నిజాయితీలతో పరిసర గ్రామాల ప్రజలందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఒక పర్యాయం ఆ గ్రామ ఉప సర్పంచ్ గా కూడా పనిచేశారు. పార్టీలో అవినీతి, అవకాశవాదం ప్రబలినప్పుడు స్నేహాలు ఇతర విషయాలన్నిటినీ తోసేసి పార్టీతో నిలబడ్డారు. చాలా ఏళ్ల క్రితం హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న సీతారామయ్య గత కొద్ది రోజుల నుండి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ వారం రోజుల నుండి విజయవాడలోని  ఆసుపత్రిలో వైద్యం చేపించుకుంటూ రాత్రి మృతి చెందారు. పోలవరం నిర్వాసితుల పాదయాత్ర కృష్ణా జిల్లాకు చేరినప్పుడు ఆయన ప్రత్యేక్షంగా పాదయాత్రలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ నెల 13వ తేదీ ఎన్నికల సమయంలో అనారోగ్యంతో ఉండి కూడా పట్టుబట్టి వచ్చి సిపిఎం అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావుకు ఓటేశారు. సీతారామయ్య మరణం ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటుని జిల్లా కార్యదర్శి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నరసింహారావు, ఆర్. రఘు తెలిపారు.

➡️