26వ వసంతంలోకి ఎస్.ఆర్.జి.ఈ.సి

Apr 3,2024 13:19 #Krishna district

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : స్థానిక శేషాద్రి రావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ రజతోత్సవ వేడుకలు గత‌ నెలలో 16 నుండి 18వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరిగిన విషయం విదితమే. 25 వసంతాలు దిగ్విజయం గా పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా ఏప్రిల్ 4 వ తేదీన కళాశాల వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణ కుమార్ తెలిపారు. కళాశాల 26 వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ మరియు ప్రొఫెసర్, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, నూజివీడు నుండి ఎం. చంద్ర శేఖర్ పాల్గొన్నారు.వార్షకోత్సవ వేడుకల్లో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలు మరియు మెరిట్ సర్టిఫికెట్స్ బహూకరణ, గత సంవత్సర కాలంలో పి.హెచ్.డి. పట్టాలు పొందిన అధ్యాపకులకు నగదు ప్రోత్సాహకాలు, విద్యార్థులకు మరియు అధ్యాపకులకు వేరు వేరుగా నిర్వహించిన క్రీడా మరియు సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతుల వితరణ, ముఖ్యులకు సన్మానాలు పొందు పరిచినట్లు ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ డా.పి.కోదండ రామారావు, డా.ఎం.ఆర్.సిహెచ్.శాస్త్రి, యాజమాన్య సలహాదారులు డా. పి.రవీంద్ర బాబు, కన్వీనర్ డాక్టర్ సి.హెచ్ సురేష్ బాబు ,ప్రొఫెసర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం, కో కన్వీనర్ డాక్టర్ ఏ. శ్రీనివాసులు, ప్రొఫెసర్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగం పాల్గొన్నారు. విద్యార్ధుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసే విధంగా మరియు అధ్యాపకులకు ఆటవిడుపుగా విద్యార్థులు, అధ్యాపకులు చే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ బుర్రా కరుణ కుమార్ తెలిపారు.

➡️