టిడిపి ప్రచారం

Apr 22,2024 23:44

ప్రజాశక్తి-గన్నవరం

గన్నవరం నియోజకవర్గ టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తరపున ఆయన సతీమణి యార్లగడ్డ జ్ఞానేశ్వరి విజయవాడ రూరల్‌ మండలం ప్రసాదంపాడు గ్రామంలోని హనుమాన్‌ నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హనుమాన్‌ నగర్‌లో ఇంటింటికి తిరుగుతూ ఎన్డీయే ప్రభుత్వంలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతిఒక్కరు సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి యార్లగడ్డ వెంకట్రావుని అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

➡️