అంగన్వాడీలపై సీఎం జగన్‌ నిరంకుశ ధోరణి

Dec 17,2023 17:17

అంగన్వాడీలపై సీఎం జగన్‌ నిరంకుశ ధోరణి

మీనాక్షి నాయుడు

ప్రజాశక్తి – ఆదోని

నాయ్యమైన డిమాండ్లు పరిష్కరించమని ప్రజాస్వామ్యబద్దంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీలపై కక్ష కట్టి ఉక్కుపాదం మోపడం జగన్‌ రెడ్డి నిరంకుశ, పెట్టుబడి దారి విధానాలకు నిదర్శనమని ఆదోని నియోజకవర్గ ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు విమర్శించారు. ఆదివారం ఆదోనిలోని స్వగృహంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తానని మాయ మాటలు చెప్పి తీరా అధికారంలో వచ్చాక మాట తప్పారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తక్కువ బడ్జెట్‌ ఉన్నప్పటికీ 2014 నాటికి అంగన్వా డీల జీతం రూ.4200లు కాగా రూ.10,500కు పెంచారన్నారు. గత ప్రభు త్వం కంటే ఎక్కువ బడ్జెట్‌ ఉన్నప్పటికీ సిఎం జగన్‌ అంగన్వాడీలను మోసం చేసి కేవలం రూ.1000 పెంచి చేతులు దులుపుకున్నారన్నారు. పొరుగు రాష్ట్రంలో సమానంగా జీతం పెంచకపోగా ఆదాయ పరిమితి అస్త్రంతో అంగన్వాడీలకు సంక్షేమంలోను కోత పెట్టారన్నారు. సంక్షేమ అమలుకు రూపొందించిన నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో నెలవారీ కుటుంబ ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతాలలో రూ.12 వేలు మించరాదనే నవరత్నాల ఆదాయ పరిమితి నిబంధనతో అంగన్వాడీలు పథకాల ఆర్ధిక సహాయం కోల్పోతున్నారన్నారు. పింఛను, అమ్మఒడి సాయం, ఇళ్ల పట్టాలు, నిర్మాణ రాయితీలు కోల్పోతున్నారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం జీతాల పెంపుతో పాటు అద్దె భవనాలలో నిర్వహిస్తున్న వాటికి అంగన్వాడీ కేంద్రాలను నిర్మించిందన్నారు. సిఎం జగన్‌ మాత్రము నాడు నేడు కింద వేల కోట్లు ఖర్చు పెట్టి అంగన్వాడీలను ఆధునీకరిస్తామని, కొత్త అంగన్వాడీ భవనాలు నిర్మిస్తా మని ఐదేళ్లు గడిపేశారన్నారు. జగన్‌కి అమూల్‌ పాలపై ఉన్న మమకారం అంగవాడీలపై లేదన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సీనియారిటీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్‌ టెన్ఫిట్‌ రూ.5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్‌ ఇవ్వాలని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవ్‌ సౌకర్యం కల్పించాలన్నారు. హెల్పర్‌ ప్రమోషన్‌లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని, పదో న్నతులలో రాజకీయ జోక్యం అరికట్టాలని, పోషణ మెనూ చార్జీలు పెంచాలని, గ్యాస్‌ ప్రభుత్వమే సరఫరా చేయాలని, సర్వీస్‌లో ఉండి చనిపోయిన కుటుం టంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, బీమా అమలు చేయాలన్నారు. అంగ న్వాడీల న్యాయపోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతు ఉంటుందన్నారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రన్న ముఖ్యమంతి కాగానే అంగన్వాడీ డిమాండ్ల పరిష్కరానికి, వారి సంక్షేమానికి పూర్తి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

➡️