ఫిట్నెస్‌లేని బస్సులపై చర్యలు తీసుకోవాలి : ఎస్‌ఎఫ్‌ఐ

Jun 21,2024 16:58 #Action, #against, #SFI, #unfit buses

ప్రజాశక్తి-ఆదోని (కర్నూలు) : ప్రైవేట్‌ పాఠశాలల ఫిట్నెస్‌ లేని స్కూల్‌ బస్సుల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గౌస్‌, శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆదోని ఆర్టిఓ కార్యాలయంలోనే వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శిరీష దీప్తి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … సరైన ఫిట్నెస్‌ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చలగాటమాడుతున్నారన్నారు. ప్రతి స్కూల్‌ బస్సుకి డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ ఏర్పాటు చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మోహన్‌, సూరి, యశ్వంత్‌, రవితేజ, నరసింహ, మహేష్‌ పాల్గొన్నారు.

➡️