ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రారంభం

చాట్రాయి: చాట్రాయిలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌ మేనేజర్‌ హనుమంతురావు సోమవారం ప్రారంభించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్నెస్‌ ఫండ్‌, యూనియన్‌ బ్యాంకు సౌజన్యంతో సొసైటీ ఫర్‌ సోషల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ సంస్థ ద్వారా ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలను వివిధ మండలాల్లో స్థాపిస్తున్నారు. దానిలో భాగంగా చాట్రాయిలో పోలవరం యూనియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హనుమంతురావు ప్రారంభించి మాట్లాడుతూ బ్యాంకుల అందించే పొదుపు పథకాలు, రుణ పథకాలు, బీమా పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఈ యొక్క ఆర్థిక అక్షర కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. సమాజంలో సైబర్‌ క్రైమ్స్‌ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్‌ ట్రాన్సాక్షన్‌ ద్వారా లావాదేవీలు చేసుకోవాలని తెలియజేశారు. ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రారంభోత్సవంలో సొసైటీ ఫర్‌ సోషల్‌ ట్రాన్స్‌ఫÛర్మేషన్‌ కౌన్సిలర్‌ చందు, కౌన్సిలర్‌ బొల్లికొండ చెన్నరావు పాల్గొన్నారు.

➡️