గ్రామ సంక్షేమమే ధ్యేయం

Dec 23,2023 19:55

శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే

– ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి
– నూతన సచివాలయం, ఆర్‌బికె, హెల్త్‌ సెంటర్లు ప్రారంభం
– రూ.3.40 కోట్ల బిటి రోడ్డుకు భూమి పూజ
ప్రజాశక్తి – గోనెగండ్ల
గ్రామ సంక్షేమమే వైసిపి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని అలువాల గ్రామంలో నూతనంగా నిర్మించిన భవనాలను ఆయన స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. సుమారు రూ.40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, రూ.20 లక్షలతో నిర్మించిన హెల్త్‌ సెంటర్‌ను, రూ.22 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాలను రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించి వారికి అవసరమైన సేవలను అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలో గ్రామ సచివాలయ భవనాలను నిర్మించినట్లు తెలిపారు. పేదలకు వైద్య సేవలు అందించేందుకు విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ను నిర్మించామని చెప్పారు. త్వరలో ప్రతి గ్రామంలోని హెల్త్‌ సెంటర్‌కు ఒక ఎంబిబిఎస్‌ డాక్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలువాల, సి.బెళగల్‌ బిటి రోడ్డు పనులకు భూమి పూజ గోనెగండ్లతో పాటు మండలంలోని వివిధ గ్రామాలు, సి.బెళగల్‌ మధ్య దూరాన్ని తగ్గించి ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలుగా సుమారు 4 కిలోమీటర్ల మేర రూ.3.40 కోట్లతో చేపట్టనున్న బిటి రోడ్డు పనులకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి భూమి పూజ చేసి, శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నూతన రోడ్డు పనులను నాణ్యతతో, వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వైసిపి సీనియర్‌ నాయకులు ఆర్‌.ప్రమోద్‌ కుమార్‌ రెడ్డి, వైస్‌ ఎంపిపి వెంకటరామిరెడ్డి, అలువాల సర్పంచి బాష, మార్కెట్‌ యార్డు వైస్‌ ఛైర్మన్‌ మన్సూర్‌, సింగిల్‌విండో ప్రెసిడెంట్‌ తిరుమలరెడ్డి, వైసిపి యూత్‌ లీడర్‌ టి.బందే నవాజ్‌, ఎర్రబాడు కాశిరెడ్డి, జడ్‌పిటిసి లలితమ్మ, గిడ్డయ్య, మండల కన్వీనర్‌ దొరబాబు నాయుడు, క్లాస్‌-1 కాంట్రాక్టర్‌ అమరేశ్వరప్ప, తహశీల్దార్‌ వేణుగోపాల్‌, ఇఒఆర్‌డి నగేష్‌, పంచాయతీ కార్యదర్శి బి.వెంకటేష్‌ పాల్గొన్నారు.

➡️