దహన సంస్కారాలకు సర్పంచి ఆర్థికసాయం

Jan 10,2024 20:43

దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందజేస్తున్న సర్పంచి ప్రేమ్‌ కుమార్‌

ప్రజాశక్తి – చిప్పగిరి
కుటుంబాన్ని పోషించే పెద్ద అనారోగ్యంతో మృతి చెందడంతో సర్పంచి ప్రేమ్‌ కుమార్‌ దహన సంస్కారాల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబమంతా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని సర్పంచి ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం మండలంలోని నేమకల్లు గ్రామంలో కుటుంబం యజమాని రాముడు (54) అనారోగ్యంతో మృతి చెందారు. పేదరికంలో ఉన్న ఆ కుటుంబానికి మానవతా దృక్పథంతో దహన సంస్కారాల నిమిత్తం సర్పంచి ప్రేమ్‌ కుమార్‌ రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు.

➡️