పోలింగ్‌ బూత్‌లను తనిఖీ చేసిన సిఐ, ఎస్‌ఐ

Jan 6,2024 20:12

తనిఖీ చేస్తున్న సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ఓబులేసు

ప్రజాశక్తి-ఆలూరు
మండలంలోని హులేబీడు, అంగస్కల్‌, మనేకుర్తి, కమ్మరచేడు గ్రామంలో పోలింగ్‌ బూత్‌లను సిఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ ఓబులేసు శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు గ్రామస్తులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు, తర్వాత గొడవలకు తావివ్వకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని తెలిపారు. రాజకీయ కక్షలకు వెళ్లి ఆర్థికంగా, పిల్లల భవిషత్యు నాశనం చేసుకోవద్దని సూచించారు. అనంతరం రహదారిపై వాహనాలు తనిఖీ చేశారు.

➡️