బానిస సంకెళ్లు తెంచి రాజ్యాధికారానికి సన్నద్ధం

Jan 13,2024 20:00

సమావేశంలో మాట్లాడుతున్న దస్తగిరి నాయుడు

– మత్స్యకార సహకారం సంఘం నాయకులు
ప్రజాశక్తి – ఆదోని
బానిసత్వ సంకెళ్లు తెంచేసి రాజ్యాధికారం కోసం సన్నద్ధం కావాలని మత్స్యకార సహకార సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు గూడూరు శ్రీనివాసులు, చిన్నతుంబళం వీరేష్‌లు సంప్రదాయ మత్స్యకారులను కోరారు. శనివారం ఆదోనిలోని మంగళ ఆంజనేయస్వామి దేవాలయంలోని కల్యాణ మండలంలో కత్తి హనుమంతరావు, పగడాల కోదండ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. అంతకుముందు సహకార కుల సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన వారిని ఘనంగా సన్మానించారు. ఆదోని డివిజన్‌లో బెస్తలకు టిక్కెట్లు కేటాయించిన వారిని కుల బాంధవులందరూ కలిసి ప్రచారం చేసి గెలిపించుకోవాలని తీర్మానించారు. టిక్కెట్లు కేటాయించకపోతే జిల్లావ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఇండిపెండెంట్‌గా పోటీకి సన్నద్ధం కావాలన్నారు.

➡️