వంటలు రుచిగా ఉండాలి

Mar 1,2024 20:54

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

– సబ్‌ కలెక్టర్‌ శివనారాయణ శర్మ
ప్రజాశక్తి – ఆదోని
పౌష్టికాహార పదార్థాలతో పాటు వంటకాలను రుచికరంగా వండాలని సబ్‌ కలెక్టర్‌ శివ నారాయణ శర్మ సూచించారు. శుక్రవారం ఆదోనిలోని క్రాంతి నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని సబ్‌ కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం తప్పకుండా విద్యార్థులకు అందించాలన్నారు. భోజనం చాలా బాగుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులను అభినందించారు. అనంతరం పాఠశాలలో ప్రతి తరగతి గదికీ తిరిగి ఉపాధ్యాయులు పిల్లలకు చెబుతున్న బోధనలను గమనించారు. చిన్నారులతో సబ్‌ కలెక్టర్‌ పాఠ్యపుస్తకాల నుంచి ప్రశ్నలు అడిగి వారి నైపుణ్యాలను గమనించారు. ప్రభుత్వ అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

➡️