వాగ్దేవి పాఠశాలలో ముగ్గుల పోటీలు

Jan 6,2024 20:03

ముగ్గుల వేసిన విద్యార్థులు

ప్రజాశక్తి – ఆదోని
ఆదోనిలోని వాగ్దేవి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి పండగ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు సురేష్‌ ఆధ్వర్యంలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రేణుక, శ్వేతబాయి హాజరై ముగ్గుల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఉపాధ్యాయులు మధు, శిరీష, అశ్విని, నవ్య, సంధ్య, బిందు, ద్రాక్షవేణి పాల్గొన్నారు.

➡️