వాల్మీకులకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించాలి

Dec 18,2023 19:49

అభివాదం చేస్తున్న వాల్మీకి నాయకులు

– వాల్మీకి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి నాయుడు
ప్రజాశక్తి-ఆలూరు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలూ వాల్మీకులకు అత్యధిక స్థానాల్లో ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించాలని వాల్మీకి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతి నాయుడు డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ఆర్‌అండ్‌బి గెస్ట్‌ హౌస్‌లో వాల్మీకి సంఘాల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ‘మనదే జెండా, మనవే ఓట్లు, మనదే రాజ్యాధికారం’ అనే నినాదంతో 100 స్థానాల్లో వాల్మీకి నాయకులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విఆర్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షులు మొలగవల్లి రామాంజనేయులు, టిడిపి మీడియా అధికార ప్రతినిధి సురేంద్ర, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్లార్తి అర్జున్‌, వాల్మీకి సీనియర్‌ నాయకులు కురువళ్లి శివన్న, జనసేన ఛత్రపతి, పెద్దహోతూరు ఎంపిటిసి వాల్మీకి రమేష్‌, అరికెర అంజినయ్య, అంజి, బోయపాటి సురేంద్ర పాల్గొన్నారు.

➡️