వైష్ణవి అకాడమీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

Jan 13,2024 19:59

బహుమతులు అందిస్తున్న సిబ్బంది

ప్రజాశక్తి – ఎమ్మిగనూరు
పట్టణంలోని వైష్ణవి అకాడమీ (విద్యాసంస్థల) ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ‘రావమ్మ మహాలక్ష్మి’ పేరుతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. శనివారం ముగ్గుల పోటీల్లో ప్రతిభ చాటిన పట్టణ మహిళలకు విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కుర్ని కార్పొరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ బుట్టా శారద, ఉపాధ్యాయులు కవిత, నాగమణి, సుజాత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళాశాల కరస్పాండెంట్‌ సత్య సిరి, కో కరస్పాండెంట్‌ కనకనిధి పోటీల్లో విజేతలను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంప్రదాయాలను మరువకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. నేటి తరానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయన్నారు.

➡️