వైసిపితోనే సంక్షేమ ఫలాలు

Jan 6,2024 20:06

దేవనకొండలో పింఛన్లు పంపిణీ చేస్తున్న గుమ్మనూరు సోదరులు

– గుమ్మనూరు సోదరులు
ప్రజాశక్తి – దేవనకొండ
పార్టీలకతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలను అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డితోనే సాధ్యమైందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ సోదరులు గుమ్మనూరు నారాయణస్వామి, శ్రీనివాసులు తెలిపారు. శనివారం మండల కార్యాలయ సమావేశ భవనంలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండలంలో దాదాపు 7 వేల పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. గతంలో పచ్చ కండువాలు కప్పుకున్న వారికే పథకాలు దక్కేవన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసిపిని గెలిపించేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. జడ్‌పిటిసి కిట్టు, ఎంపిపి భర్త లుముంబా, వైసిపి మండల కన్వీనర్‌ కప్పట్రాళ్ల మల్లికార్జున, తెర్నేకల్‌, అలారుదిన్నె సర్పంచరలు అరుణ్‌ కుమార్‌, మల్లయ్య, వైసిపి నాయకులు దివాకర్‌ నాయుడు, రామచంద్ర, చంద్రన్న, ప్రేమ్‌ నాథ్‌ రెడ్డి, మదన్‌ మోహన్‌ రెడ్డి, కొత్తపేట బాబు, కరివేముల వీరేష్‌ పాల్గొన్నారు.

➡️