సమాజానికి అంబేద్కర్‌ ఆదర్శ ప్రాయుడు

Jan 5,2024 20:42

విగ్రహావిష్కరణలో పాల్గొన్న తిక్కారెడ్డి

– విగ్రహావిష్కరణలో ప్రముఖులు
ప్రజాశక్తి – మంత్రాలయం
రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ సమాజానికి ఆదర్శ ప్రాయుడని టిటిడి పాలక మండలి సభ్యులు వై.సీతారామిరెడ్డి, టిడిపి ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి, వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్‌ రెడ్డి, టిడిపి సీనియర్‌ నాయకులు రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకులు రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని సుంకేశ్వరి గ్రామంలో నవ్యాంధ్ర ఎంఆర్‌పిఎస్‌ జిల్లా అధ్యక్షులు రామతీర్థం అమ్రేష్‌ మాదిగ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంబేద్కర్‌ గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఆ మహనీయుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ఎఐసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లెల ఆల్ఫ్రెడ్‌ రాజు, నవ్యాంధ్ర ఎంఆర్‌పిఎస్‌ జిల్లా మహిళా అధ్యక్షులు కదిరికోట బతుకమ్మ, సమాల చార్లెస్‌, అడ్వకేట్స్‌ పార్లపల్లి జయన్న, సుంకేశ్వరి కిషోర్‌, ఏనుగుబాల చార్లెస్‌, డిటిఎఫ్‌ నాయకులు నాగన్న, మంత్రాలయం సిఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ వేణుగోపాల్‌ రాజు, మాధవరం ఎస్‌ఐ కిరణ్‌ బాబు, మంత్రాలయం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎంపిడిఒ మణిమంజరి, ఎఒ గణేష్‌, వికాస్‌ తేజ, పంచాయతీ కార్యదర్శులు ఇస్రాత్‌ బాషా, సుంకేశ్వరి గ్రామ విగ్రహ కమిటీ పెద్దలు స్వామినాథం, బాలస్వామి, ఏసన్న, ముక్కరన్న, పెద్ద ఆంథోని, చిన్న ఆంథోని, దేవా, రాజు, పాల్గొన్నారు.

➡️