స్పందించకుంటే కలెక్టరేట్లు ముట్టడిస్తాం

Jan 1,2024 17:19 #Kurnool
anganwadi workers strike 21 day knl
  • అంగన్వాడీ కార్మిక సంఘాల హెచ్చరిక
    21వ రోజు కొనసాగిన అంగన్వాడీల సమ్మె

ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ :  అంగన్వాడీల సమ్మె 21వ రోజుకు చేరుకుంది. ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీ లు మ్యూజికల్ చైర్స్ ఆడి తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. నూతన సంవత్సరం అని చూడకుండా అంగన్వాడిలు సమ్మె శిబిరానికి చేరుకున్నారు. సమ్మెను ఉద్దేశించి సిఐటియు ఎఐటియుసి నాయకులు రెండు రోజులలో ప్రభుత్వం అంగన్వాడి సమస్యలపై స్పందించకుంటే కలెక్టరేట్లను ముట్టరిస్తామని వారు హెచ్చరించారు. ఎఐటియుసి నగర అధ్యక్షులు రామాంజనేయులు సిఐటియు నగర ఉపాధ్యక్షులు కె సుధాకరప్ప అధ్యక్షతన జరిగిన సమ్మెలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ ఏఐటియుసి రాష్ట్ర నాయకులు మనోహర్ మాణిక్యం ఎఐటియుసి జిల్లా కార్యదర్శి యస్ మునెప్ప సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంజిబాబు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు కె.వి నారాయణ, రాధాకృష్ణలు మాట్లాడుతూ గత 20 రోజులుగా అంగన్వాడీ అక్కా చెల్లెమ్మలు రోడ్లపై సమ్మెలు చేస్తుంటే కళ్ళులేని కబోది లాగా చెవులు లేని చెవిటివాడి లాగా నోరు ఉండి మాట్లాడలేని మూగవాడిలాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఇప్పటికైనా అంగన్వాడీల వైపు చూసి ఈ నూతన సంవత్సరంలో సరైన నిర్ణయం తీసుకుని అంగన్వాడీల సమస్యపై స్పందిస్తే భవిష్యత్తు ఉంటుందని లేదంటే రాబోయే ఎన్నికల్లో అంగన్వాడీలు చేసే పోరాటాలకు ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని వారు హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,20,000 మంది అంగన్వాడీలు క్రిస్టమస్ పండగ నూతన సంవత్సర వేడుకలు చేసుకోకుండా ఇంట్లో కుటుంబాలను వదులుకొని పిల్లలను భర్తలను వదులుకొని రోడ్లపై అనేక రూపాలలో ఆందోళన చేస్తూ ప్రభుత్వం నిర్బందకాండను గత 20 రోజులుగా ఎదుర్కొంటూ ఉద్యమం సాగిస్తున్న అంగన్వాడీలు చేస్తున్న పోరాటం ప్రభుత్వానికి ఏమాత్రం చలనం లేకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. అనేక రూపాలలో తమ మద్దతును తెలియజేస్తున్న కార్మిక సంఘాలు పార్టీలు ఉద్యోగ సంఘాలు లాయర్స్ అసోసియేషన్ లు ముందుకు వచ్చి అంగన్వాడీల సమ్మె కు మద్దతు తెలుపుతున్నారు. కానీ అధికారంలో వుండి లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్న అధికార పార్టీ శాసనసభ్యులు గాని పార్లమెంటు సభ్యులు గాని స్థానిక కార్పొరేటర్లు గాని మహిళల గోడు పట్టడం లేదా వినిపించడం లేదా అని వారు ప్రశ్నించారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని అంగన్వాడీలు న్యాయంగా కోరుతున్న కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని గ్రాడ్యుటి 5 లక్షల ఇవ్వాలని టిఎ డిఏ బకాయి బిల్లులు ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి హమాలీ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు ఐలూ జిల్లా నాయకులు రవికుమార్ సిఐటియు జిల్లా నాయకులు ఎం గోపాల్ ఎం విజయ్ సిఐటియు నగర నాయకులు యస్ మహమ్మద్ రఫీ కె రామకృష్ణ అంగన్వాడీ జిల్లా నాయకులు బి రేణుకమ్మ విజయలక్ష్మి మీనాక్షి పరమేశ్వరీ హైమవతి అంగన్వాడీ టీచర్లు ఆయాలు హాజరయ్యారు.

➡️