అష్టదిగ్బంధం చేసిన అంగన్వాడీలు 

Jan 20,2024 12:32 #Kurnool
anganwadi workers strike 40th day mass org rastaroko knl

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజ్ విహార సెంటర్ లో మానవహారం 
ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : అంగన్వాడీల నిరవధిక సమ్మె ఉదృతంగా మారింది. శనివారం 40 రోజులకు చేరిన అంగన్వాడీల నిరవధిక సమ్మె మరింత ఉదృతం అయింది. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ప్రధాన కూడలి రాజ్ విహార్ సెంటర్ ను అంగన్వాడీలు అష్టదిగ్బంధం చేశారు. అన్ని రహదారులను మూసివేసి సీఎం డౌన్ డౌన్, మాట తప్పిన సీఎం,అక్కచెల్లెమలను నడి రోడ్డుపై కూర్చోబెట్టారు అని నినాదాలతో హోరెత్తించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 40 రోజులుగా శాంతి యుతంగా సమ్మె చేస్తున్న చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారని తక్షణమే వేతనాలు పెంచాలని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల జిల్లా గౌరవాధ్యక్షురాలు నిర్మల, సిఐటియు జిల్లా అధ్యక్షుడు పీఎస్ రాధాకృష్ణ, కార్యదర్శి ఎం.డి అంజిబాబు, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి మునెప్ప, రామాంజనేయులు, ఐఎఫ్ టియు జిల్లా కార్యదర్శి భాస్కర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, నగర కార్యదర్శి హుస్సేన్ బాషా, సిఐటియు నాయకులు గోపాల్, విజయ్, సుధాకరప్ప, రాముడు, అంగన్వాడీలు ఆయాలు హెల్పర్స్ పాల్గొన్నారు.

➡️