హంద్రీనది నుండి త్రాగునీరు అందించాలి

Jan 31,2024 16:22 #Kurnool
cpm demand for driniking water

సిపియం డిమాండ్ 

ప్రజాశక్తి-కోడుమూరు : పాలకుర్తి మజరా గ్రామమైన కొత్తూరులో తాగునీటి కొరకు ఎంతో ఇబ్బందులు పడుతున్నారో ఆ గ్రామ ప్రజలు ఏళ్ల తరబడి కొండనిల్లే త్రాగడానికి ఉపయోగించుకుంటున్నారు కుంటలో పురుగులు విషపురుగులు రకరకాల రోగాల భారీ భారిన పడే క్రిమిలు ఎన్నో ఉన్నాయి. అయినా మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న కర్నూలు బళ్ళారి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి కొత్తూరు గ్రామానికి త్రాగునీరు లేదంటే ఎంతో ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాలకులు గాని ప్రభుత్వం గానీ అధికారులు గానీ కుంట నీరు ఎలా తాగుతారని కొంచమైనా సరే ఆలోచించడం లేదు. సిపిఎం పార్టీగా చాలాసార్లు అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన కొత్తూరు గ్రామాన్ని పట్టించుకున్న పాపం లేదు. ప్రస్తుతం కుంటాను సిపిఎం పార్టీ బృందం పరిశీలించడం జరిగింది. ఉన్నటువంటి మీరు అట్టడుగునా ఉన్నాయి అందులో చాలా మలినమైనటువంటి చెడిపోయినటువంటి నీళ్లు ఉన్నాయి. ఆ నీటినే ఇప్పటికీ ఆ ప్రజలు తాగుతున్నారు. మరి కనీసం ప్రభుత్వం ప్రజలకు మంచి ఆరోగ్యమిస్తాము ప్రజలను ఆదుకుంటాం అన్నటువంటి ప్రభుత్వం కొత్తూరు గ్రామ ప్రజలకు తిండి పక్కన పెడితే కనీసం తాగి నీరైనా సరే అంత చిన్న గ్రామానికి ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉన్నది. పక్కనే హందిరీ నది ఉన్నది. హంద్రీ నది నుండి పైప్ లైన్ వేసి ఆ గ్రామానికి తాగునీరు అందిస్తే కనీసం మంచినీళ్లు తాగిన సరే వాళ్ళని ఆరోగ్యా కనీసం తాగి నీరైనా సరే అంత చిన్న గ్రామానికి ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం ఉన్నది పక్కనే హందిరీ నది ఉన్నది. హంద్రీ నది నుండి పైప్ లైన్ వేసి ఆ గ్రామానికి తాగునీరు అందిస్తే కనీసం మంచినీళ్లు తాగిన సరే వాళ్ల ఆరోగ్యాలు కాపాడుకుంటారు ప్రస్తుతము కుంటలో నీరు అడుగంటి పోయాయి. అధికారులు వెంటనే స్పందించి కుంటను శుభ్రం చేయించి కుంటకు కాలువ ద్వారా నీరు నింపాలి అలాగే సుజల స్రవంతి పథకం కింద తాగునీటి కొరకు ట్యాంక్ నిర్మించారు. నెలలో 15 రోజులు అది పనిచేస్తుంది 15 రోజులు నిలబడిపోతుంది అది కూడా డబ్బులు ఇచ్చి నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది తాగునీరు కూడా కొనుక్కునే పరిస్థితి ఉందంటే మరి ఎక్కడున్నామో మనం ఎంత అభివృద్ధి ఉందో కనబడుతోంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గానీ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి కొత్తూరు గ్రామానికి తాగునీటి సరఫరా చేయాలని కుంటను శుభ్రం చేసి వాడుకోవడానికి మంచినీళ్లు ఇవ్వాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలో ప్రజలను చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు శాఖ సభ్యులు శ్రీనివాసులు .శంకరయ్య బాబయ్య .అయ్యన్న ఖాజా హుస్సేన్ .పుల్లమ్మ హుస్సేన్ అమ్మ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

➡️