శ్రీనివాసులుకు డాక్టరేట్ ప్రధానం

Mar 8,2024 16:40 #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు జిల్లా గూడూరు మండల కేంద్రానికి చెందిన మునుగాల శ్రీనివాసులుకు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం డాక్టరేట్ ను ప్రధానం చేసింది. ఆ విభాగం ప్రొఫెసర్ దాశరథి రవీందర్ పర్యవేక్షణలో పీహెచ్డీ డిగ్రీ కోసం ” యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అమాంగ్ ఎంటెక్ స్టూడెంట్స్ ఆఫ్ యూనివర్సిటీ కాలేజెస్ ఇన్ ద రాయలసీమ ఏరియా ఆంధ్రప్రదేశ్ ఏ స్టడీ” అనే అంశంపై పరిశోధన గ్రంధాన్ని యూనివర్సిటీకి శ్రీనివాసులు సమర్పించారు. రాయలసీమ ప్రాంతంలో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని ఎంటెక్ విద్యార్థులు ఉన్నత విద్యలో సమాచారాన్ని స్వీకరించే నిమిత్తం వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించి పోటీ ప్రపచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆకలింపు చేసుకోవడం, సాంకేతిక విద్యలో గ్రంథాలయాలు, ఎలక్ట్రానిక్ వనరుల ప్రముఖ్యతపై ఈ పరిశోధన సాగింది. ఓపెన్ వైవా వాయిస్ లో తన పరిశోధనని సైంటిఫిక్ మెథడ్ లో నివేదికను విజయవంతంగా అందజేశారు. ఈనేపథ్యంలో శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ మునుగాల శ్రీనివాసులుకి డాక్టరేట్ ప్రదానం చేసింది. ఓపెన్ వైవా వాయిస్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ గా పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీ సైన్స్ విభాగం ప్రొఫెసర్ ఆర్ సెవుకన్ హాజరయ్యారు. ఎస్.కె యూనివర్సిటీ ఆర్ట్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ బీ.వి రామన్, ప్రొఫెసర్. వెంకట్ నాయుడు తన అధ్యయనానికి సహకరించారన్నారు. తన డాక్టరేట్ ఫలప్రదం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.

➡️