రోడ్లు వెంబడి అంగన్వాడీలు భిక్షాటన

Dec 16,2023 13:09 #Kurnool
knl anganwadi strike 5th day

ప్రజాశక్తి-ఆదోని: మా సమస్యలు న్యాయమైనవే పరిష్కరించకుండా సహనాన్ని పరీక్షించొద్దు అంటూ ప్రభుత్వానికి అంగన్వాడీలు అల్టిమేటమ్ జారీ చేశారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరుకుంది రోజు రోజుకు వివిధ రూపాలలో అంగన్వాడీలు జనాల మద్దతు కూడగట్టుకుంటూ ఉద్యమాన్ని ఉదృతం చేస్తున్నారు. శనివారం ఆదోని పట్టణంలో దుకాణాల ముందు బిక్షటన చేస్తూ అంగన్వాడీలు నిరసన చేపట్టారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రాచుటీ ఇవ్వాలని కోరుతున్న సీఎం జగన్ పట్టించుకోవడంలేదని యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటమ్మ తెలిపారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వివిధ రూపాలలో నిరసన తెలియజేస్తామన్నారు. తమ పట్ల కనికరం చూపకుండా సెంటర్లను తాళాలు పగలగొట్టి ఓపెన్ చేయించడం సమంజసం కాదన్నారు. ఉద్యమాన్ని నేరగారించేందుకు ఎన్ని కుయుక్తులు చేసిన ముందుకు సాగుతాం అన్నారు మున్సిపల్ రోడ్ భీమస్ సర్కిల్, పి.యన్ రోడ్ రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా బిక్షటన జరిగింది. కార్యక్రమంలో నాయకురాలు వరలక్ష్మి జానకి శారద పద్మ తదితరులు ఉన్నారు.

➡️