నవోదయలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

Feb 28,2024 16:25 #Kurnool
science day in kurnool

ప్రజాశక్తి-ఎమ్మిగనూరు రూరల్ :  ప్రముఖ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర్ వెంకటరామన్.. ఆయన 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్‌ను కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. భౌతికశాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్దం ఆ తేదిని జాతీయసైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి మాట్లాడుతూ రామన్ జీవితంలో మరో మైలురాయి రామన్ ఎపెక్ట్ సిద్దాంతం.. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరివర్తనం చెందుతుందని.. దాని వల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని తన సిద్దాంతాల ద్వారా రుజువు చేశారు రామన్. అప్పటికున్న అరకొర సదుపాయాలతోనే మన దేశ విజ్ఞాన కిరణాలను నలుదిశలా ప్రసరింపజేశారు. విద్యాలయంలో ఏటా ఒక్కో థీమ్‌తో జాతీయ సైన్స దినోత్సవం జరుపుకుంటాము . ఈ ఏడాది కూడ విద్యార్థులు మిమ్స్ ప్రదర్శన ద్వారా సేవ్ వాటర్ సేవ్ వరల్డ్ అనే మెసేజ్ ను తెలియజేసారు. ఈ కార్యక్రమంలో వైస్-ప్రిన్సిపాల్ కె. చంధీరన్, బసవరాజ్, పద్మజ నాన్సీ, హరీష్ కుమార్, రింకుశర్మ,అరవింద్-భట్, జగన్నాథ్, శిరీష్, శ్రీనివాసరావు, వెంకటేష్, మీనాచంద్రన్, సోనమ్ కుమారి, శశికిరణ్, నరేష్, శ్రీలక్ష్మి, రవీందర్, సునీత తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.

➡️