టీబీ రోగుల‌ను ద‌త్త‌త‌కు ముందుకు రావాలి

Dec 16,2023 15:54 #Kurnool
tb patients in adoni

ప్రజాశక్తి-ఆదోని : ప్ర‌ధాన మంత్రి టీబీ ముక్త్ భార‌త్ అభియాన్‌లో భాగంగా ఆదోనిలోని టీబీ కేంద్రంలో శ‌నివారం ల‌య‌న్స్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో పోష‌కాహార కిట్ల‌ను 34 మంది పేద టీబీ రోగుల‌కు పంపిణీ చేశారు. జిల్లా ఛైర్మ‌న్ డాక్ట‌ర్ గోపీనాథ్‌, టీబీ ఆఫీస‌ర్ షేకూన్ బాను మాట్లాడుతూ పోష‌కాహారంతోపాటు వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త పాటిస్తే వ్యాధిని నియంత్రించ‌వ‌చ్చ‌న్నారు. విరాళదారుల‌కు భార‌త ప్ర‌భుత్వం ద్వారా స‌ర్టిఫికేట్లు అంద‌జేశారు. దాత‌లు ముందుకొచ్చి టీబీ రోగుల‌ను ద‌త్త‌త తీసుకోవాల‌ని కోరారు. రీజియ‌న్ ఛైర్మ‌న్ ప్ర‌సాద‌రావు, అధ్య‌క్షుడు ధ‌ర్మ‌రెడ్డి, ఈసీ మెంబ‌ర్లు వ‌న‌ప‌రాజు, డాక్ట‌ర్ ఉషారావు, డిప్యూటీ సివిల్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ బాల ముర‌ళీ కృష్ణ‌, టీబీ స్టాఫ్ బాబు రాజు, మ‌నోరంజిని, మేరీ జ్ఞానేశ్వ‌రి, వీరేష్‌, సుబ్బ‌మ్మ బాయ్‌, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

➡️