ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

Jan 25,2024 15:29 #Kurnool
voters day in gonegandla

ప్రజాశక్తి – గోనెగండ్ల : మండల కేంద్రమైన గోనెగండ్లలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ 14వ ఓటరు దినోత్సవాన్ని తహసిల్దార్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి హాజరయ్యారు. విద్యార్థుల ర్యాలీ కార్యక్రమాన్ని సీఈవో ప్రారంభించారు. ఉన్నత పాఠశాల నుంచి బస్టాండ్ వరకు విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ ఆవరణంలో విద్యార్థుల చేత ఉపాధ్యాయులు మానవహారం చేపట్టారు.18 ఏళ్లు నిండిన యువతి యువకులు ఓటరు గా నమోదు చేసుకుని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ ఏవో బాబు భాస్కర్,ఎంఈఓ నీలకంఠ,హెచ్ ఎం నాగభూషణం, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయులు అబ్దుల్ సలీం, స్వర్ణ, మణి కుమారి, నసీరుల్లా బేగ్, వీఆర్వో లు రంగముని, కిషోర్ పాల్గొన్నారు.

➡️