ఆంధ్రజ్యోతి విలేఖరిపై దాడిని ఖండిస్తున్నాం

Feb 19,2024 16:27 #Kurnool
We condemn the attack on Andhra Jyoti reporter

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : ప్రజాస్వామ్యంలో పట్టుకొమ్మగా ఉన్న జర్నలిజం వ్యవస్థపై దాడి చేయడం, ఆంధ్రజ్యోతి విలేఖరి కృష్ణను దారుణంగా కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రెటరీ పాలకవీటి విజయకుమార్ అన్నారు. జగన్ రెడ్డి చొక్కాలు మడత పెట్టండి చీపుర్లతో, చెప్పులతో కొట్టండని సిద్ధం సభలో బాహాటంగా చెప్పటం వాళ్ళ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడమేనని ఆయన అన్నారు. శాంతి పద్ధతులను కాపాడాల్సిన పోలీసులు అసమర్థులుగా మిగిలిపోయి తమ కంటి ముందు జరుగుతున్న దారుణాలు కూడా ఆపే పరిస్థితి లేకపోవడం బాధాకరం అన్నారు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థఅసమర్ధతకు ఆంధ్రజ్యోతి విలేఖరి కృష్ణ పై జరిగిన దాడి ఘటన నిలువెత్తు నిదర్శనం అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన నాలుగో స్తంభమైన జర్నలిజాన్ని ఈ రాష్ట్రంలో వాస్తవాలు చెప్పే విలేకరులపై ఇది మొదటి దాడి కాదు ఇప్పటికే చాలా సంఘటనలు జరిగాయన్నారు. వృత్తి ధర్మాన్ని పాటిస్తున్న వ్యక్తులపై దాడి చేయడం ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ పై దాడిగా భావించాలని అన్నారు. దీనికి, అన్నిటికి కూడా రెండు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, అప్పుడు ఈ దాడిన ప్రోత్సహించిన నాయకుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా విజయ్ కుమార్ హెచ్చరించారు.

➡️