కేంద్రం మార్గదర్శకాల మేరకే ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ : వైసిపి

May 1,2024 23:54

విలేకర్లతో మాట్లాడుతున్న డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ప్రజలకు వారి భూములపై సర్వ హక్కులు కల్పించటమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ముఖ్య ఉదేశమని వైసిపి నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ చట్టంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. బుధవారం స్థానిక ప్రకాష్‌ నగర్‌లో వైసిపి కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో జీవో ఎలా వస్తుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వచ్చిందేగాని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. అమరావతి రాజధాని అంశంలో వైపిపిని విమర్శిస్తున్నారని, ఎన్‌డిఎ కూటమి మేనిఫెస్టోలోనూ ఈ అంశం లేదని చెప్పారు. ఆయనవెంట నాయకులు డాక్టర్‌ గజ్జల బ్రహ్మారెడ్డి, డాక్టర్‌ కొండపల్లి వెంకటేశ్వరరావు ఉన్నారు.

➡️