ఎమ్మెల్యేకు లాన్‌ టెన్నిస్‌ సభ్యుల అభినందన

ప్రజాశక్తి-గిద్దలూరు: ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి గిద్దలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముత్తుముల అశోక్‌రెడ్డికి ప్రకాశం జిల్లా, గిద్దలూరు లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ సభ్యులు స్థానిక టీడీపీ కార్యాలయంలో కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అశోక్‌రెడ్డి కూడా టెన్నిస్‌ క్రీడకు సంబంధించి మంచి అవగాహన కలిగిన క్రీడాకారుడు అని, అందువల్ల టెన్నిస్‌ క్రీడను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ జికె మోహన్‌రెడ్డి, గిద్దలూరు లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సిహెచ్‌ రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి జివి రాఘవులు, ఉపాధ్యక్షులు శివప్రసాద్‌, కోశాధికారి ఖాదర్‌ బాషా, డాక్టర్‌ శ్రీనివాసులు, కోటయ్య గౌడ్‌, టపా ఖాదర్‌ వలి, డాక్టర్‌ సతీష్‌ తదితర టెన్నిస్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

➡️