చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిన నేతలు

పుట్లూరు (అనంతపురం) : పుట్లూరు మండలంలోని ఓబులాపురం గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకట నాయుడు, బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామం వైసిపి ఎస్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సాకే రామకఅష్ణ శనివారం ఉదయం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసా నాయుడు, ముంటి మడుగు కేశవ రెడ్డి, జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి సుదర్శన్‌ నాయుడు, జిసి.బాబు, గోవర్ధన్‌ రాజు పాల్గొన్నారు.

➡️