రాజాంలో న్యాయ అవగాహన సదస్సు

May 4,2024 21:29

ప్రజాశక్తి- రాజాం : మండల న్యాయ సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక శ్రీ విద్యానికేతన్‌ పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షులు, సీనియర్‌ సివిల్‌ జడ్జి సిహెచ్‌ వివేక్‌ ఆనంద్‌ శ్రీనివాస్‌ బాలల సంరక్షణ, స్నేహ పూర్వక న్యాయ సేవల పథకంపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌, స్నేహపూర్వక స్వభావం, సోదర భావం, దేశ భక్తి తదితర అంశాలపై వివరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ పాటించాల్సిన విధి విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో రాజాం జూనియర్‌ సివిల్‌ జడ్జి పిఎస్‌విబి కృష్ణసాయి తేజ, న్యాయవాదులు ఆర్‌ విజరుకుమార్‌, ఎం. శ్రీనివాసరావు, శ్రీ విద్యానికేతన్‌ పాఠశాల కరస్పాండెంట్‌ జి. పాపారావు, రాజాం టౌన్‌ పోలీసు సిబ్బంది, స్కూల్‌ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️