మానవాళి విముక్తికి మార్గం చూపిన మహా నేత లెనిన్

Jan 21,2024 14:56 #IV Lenin, #vijayanagaram

ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : విశ్వ మానవాళి విముక్తి కోసం మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని దేశ నిర్ధిష్ట పరిస్థితులకి అమలు చేసి రష్యాలో మొట్ట మొదట దోపిడి లేని కార్మిక రాజ్యం స్థాపించిన మహా నేత లెనిన్ అని ఆయన స్ఫూర్తితోఛైనా, క్యూబా వియత్నాంలో విప్లవాలు సాధించిన దేశాలు నేడు ప్రపంచ దేశాల కి ఆదర్శంగా నిలిచాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు అన్నారు. ఆదివారం లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మిక వర్గానికి దోపిడి నుండి విముక్తికి లెనిన్ ఆచరణలో పెట్టి రష్యాలో సాధించిన విజయం నేడు ప్రపంచానికి స్ఫూర్తి అని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో భారత దేశంలొ లేనిన్ స్ఫూర్తి తో కార్మిక, కర్షక ఐక్యతతో సిపిఎం ప్రజా ఉద్య మాలు నిర్మిస్తుందని. అన్నారు. లెనిన్ చూపిన మార్గంలో పయనించే సిపిఎం బాటలో ప్రజలంతా పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి. రమణమ్మ , ఏ. జగన్ మోహన్, సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు బి. రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️